విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో క్రీస్తురాజుపురం లో క్రైస్ట్ ద స్కూల్ గ్రౌండ్ నందు 3, 5 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భలో అవినాష్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఇంటి ముందుకు సంక్షేమ పథకాలను అందజేస్తూ, జగనన్న సంక్షేమ పాలనకు సారథులు వాలంటీర్లేనన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు. జగనన్న తలపెట్టిన పేదరిక నిర్మూలన అనే యజ్ఞంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. .సీఎం జగనన్న దేశంలో ఎక్కడా లేని విధంగా, ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ ‘గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ’ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనే వాలంటీర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు.గతంలో జన్మభూమి కమిటీ పేరుతో దోపిడీ జరిగిందన్నారు. గత జన్మభూమి కమిటీలకు, వాలంటీర్ వ్యవస్థకి మధ్య తేడాను ప్రజలంతా గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3,5 డివిజన్లలో కొండ పైన చివరి ఇంటి వరుకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లకు అవినాష్ కృతఙ్ఞతలు తెలిపారు.తదనంతరం వాలంటీర్ల సేవలకు ప్రోత్సాహకంగా 3,5 డిసీజన్ల సంబందించి వాలంటీర్లకు సేవ వజ్రా,సేవా రత్న,సేవ మిత్ర అవార్డులతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాలు అంబెడ్కర్,జోనల్ కమిషనర్ కృష్ణ వైస్సార్సీపీ నాయకులు మట్ట ప్రసాద్,లామ్ కిరణ్,డేవిడ్ రాజు,చిత్రం లోకేష్,భీమిశెట్టి బాబు,నాని,సుందరావు,ఉదయ్,పచ్చిగోళ్ళ రమేష్, బాలస్వామి, అప్పారావు, సుబ్బారావు, పద్మ, షకీలా,రత్నరాజు,నీలం కొండా,సత్యనారాయణ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News