-త్వరలో పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తామన్న పరిశ్రమ వర్గాలు
-కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఐ పంగిడి గ్రామంలో త్రివేణి రెన్యూవేబుల్ ప్రవేట్ లిమిటెడ్ పరిశ్రమను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మొత్తం రూ.1350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని, సుమారు 2400 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉద్యోగ అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమకు చెందిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కలెక్టర్ కు కంపెనీ ప్రతినిధులు సూచనలు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా పరిశ్రమ కు సంబంధించి ఉత్పత్తులు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని వివరించారు. పునరుత్పత్తి సామర్థ్యం కలిగి గ్లాస్ ఉత్పత్తి చేసే విధానం పై కలెక్టర్ కు వివరించడం జరిగింది. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లి బాబు, జిల్లా పరిశ్రమల అధికారి బి . వేంకటేశ్వర రావు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏబివి ప్రసాద్, కంపెనీ ఎం డి. వరుణ్ గుప్తా , తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News