Breaking News

బంగారుకొండ ద్వారా పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధ్యం

-తప్పనిసరిగా వారంలో ఒక్క రోజు దత్తత తీసుకున్న పిల్లల ఇంటిని సందర్శించాలి
-ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చెయ్యాలి
-సూచనలు సలహాలు కోసం జిల్లా, మండల స్థాయి లో చర్చించి సూచనలు ఇవ్వండి
-కలెక్టర్ మాధవీలత , జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలో పోష్టికాహర లోపం అంధిగమించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం రూపొందించిన “బంగారుకొండ” కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో బంగారుకొండ అనే సరికొత్త కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. మండల స్థాయి లో అనామియా, బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి తగిన బలవర్ధకమైన ఆహారం అందించాలన్నారు. తద్వారా వారిలో వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా అందచేయవలసిన ఆహారం పై ఒక నిర్దుష్ట చార్ట్ రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వారం వారం ఆయా సహజ ఆహార పదార్థాల ముడి సరుకు తల్లులకు అందచేసి పిల్లలకు తీసుకునేందుకు వీలుగా అవగాహన అవసరం అన్నారు. ప్రతి వారం పిల్లల్లో జరుగుతున్న మార్పు పై నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ తరహా కేటగిరీ లో ఉన్న పిల్లల్ని గుర్తించడం జరిగిందన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషకాహార పథకం కింద సమతుల్య ఆహారం అందిస్తున్నాము అని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ కర్త ఆధ్వర్యంలో చిల్డ్రన్ స్పెషలిస్ట్, న్యూట్రీషియన్ స్పెసిలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఒక నిర్దుష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని మాధవీలత ఆదేశించారు. ఆమేరకు కిట్ లో ఏ ఏ పోషక విలువలతో కూడిన ఒక వారం రోజుల సరిపడే ఆహార పదార్థాలు, వాటికి ఎంత ఖర్చు అవుతుందనే అంశం కీలకం అన్నారు. ఆమేరకు మూడు నుంచి ఆరు నెలలకు సరిపడే విధంగా దాతలు సహకారం తీసుకోవలసి ఉంటుందన్నారు. వారంలో ఒక్కసారి ఖచ్చితంగా ఆ పిల్లల వద్దకు వెళ్ళి వివరాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళడం సాధ్యం అవుతుందని అన్నారు. మొదటి నెల అమలు చేస్తున్న తీరుపై సమీక్ష చేసి, భవిష్యత్ కార్యాచరణ సిద్దం చెయ్యాలని సూచించారు. కనీసం ఆరు నెలలు పాటు అందచేసే కిట్ కోసం అయ్యే వ్యయం వివరాలు తెలుపుతామని అన్నారు.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆసక్తి కలిగిన వారిని అధికారులను, ప్రజలను భాగస్వామ్యం తప్పనిసరి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. ఆరు నెలల నుంచి ఏడాది వయస్సు ఇక కేటగిరీ, ఏడాది పై బడిన వారిని రెండవ కేటగిరీ గా గుర్తించి బలవర్ధక ఆహారం అందించాల్సి ఉంటుందన్నారు. అధికారులు తమ విలువైన సూచనలు సలహాలు ఇవ్వడం తో పాటు గా బిడ్డ యొక్క తల్లుల అభిప్రాయ లను తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల ద్వారా పర్యవేక్షణ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *