Breaking News

చదువుల్లో చురుగ్గా వ్యవహరించడానికి క్రీడలు చక్కటి అవకాశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, చదువుల్లో చురుగ్గా వ్యవహరించడానికి క్రీడలు చక్కటి అవకాశం అని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్. శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక వైటిసి ప్రాంగణంలో సాఫ్ సరఫరా చేసిన క్రీడా పరికరాలను కోచ్ లకు అందచేశారు. వేసవి శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్. శ్రీనివాస్ కోరారు. జిల్లా వ్యాప్తంగా 65 వేసవి శిక్షణా శిబిరాలను జిల్లా స్పోర్ట్స్ ఆధారటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా చీఫ్ కోచ్ డి.ఎం.ఎం.శేషగిరి వివరాలు తెలుపుతూ జిల్లాలో 65 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్న మన్నారు . వాటిలో 49 యూనిట్స్ కు సంబంధించి ఆయా విభాగాలకు అవసరమైన క్రీడా పరికరములు సరఫరా చేయడం జరిగిందన్నారు. వాలీబాల్ 7, బాస్కెట్ బాల్ 7, ఫుట్ బాల్ 3 , బాల్ బ్యాట్మింటన్ 3 , యోగా కిట్స్ 4 , జూడో 3 , బాక్సింగ్ 3 , హ్యాండ్ బాల్ , కబాడి , కిక్ బాక్సింగ్, కరేటే , క్రికెట్ కిట్స్ రెండు చొప్పున, ఆర్చరీ, అధ్లెటిక్స్ , సేపక్తక్రా.(కాలుతో ఆడే బంతిఆట) టేబుల్ టెన్నిస్, త్వైక్వాండ్ లు ఒక్కొక్కటి చొప్పున అయా క్రీడా పరికరముల కిట్స్ కోచ్ లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో  డివిజనల్ పియర్వో ఎమ్ ఎల్ ఆచార్యులు, యోగా కోచ్ బి.వి.జి .నాగేంద్రన్, బాస్కెట్ బాల్ కోచ్ ఎన్.మోహన్ దాస్ , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *