Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా నేటి సామూహిక నిరాహార దీక్షలు విజయవంతం…

-ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఎన్ని రోజులు అయినా సరే ఉద్యమం ఆపేదిలేదని, నేటికి 83 వ రోజుకు ఉద్యమం చేరుకున్న సరే ప్రభుత్వానికి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న ఆలోచన కలగక పోవడం చాలా బాదాకరమని, ఉద్యమం ఫలితంగా కొన్ని ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు పరిష్కరించినప్పటికీ మిగిలిన డిమాండ్లు పరిష్కారపై స్పష్టతతో లిఖిత హామిని షెడ్యూల్ రూపంలో ఇమ్మని అడుగుతుంటే ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారో అర్దం కావడంలేదని ఏపీ జెఎసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన సామూహిక నిరాహార దీక్షలు 26 జిల్లాలల్లో విజయవంతం అయ్యాయని తెలిపారు.

మంగళవారం విజయవాడ లెనిన్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యన్.టి.ఆర్ జిల్లా కమిటి ద్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు ఉద్యోగులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని బొప్పరాజు ప్రసంగించారు. నేడు చేస్తున్న పోరాటంలో కొత్త కోరికలు కోరలేదని, ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం ముందు ఉంచామని అవి కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు.

నల్ల బ్యాడ్జి తో ప్రారంభించిన ఉద్యమం నేడు ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అంతర్యం పెరిగిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఏకాగ్రత తో న్యాయమైన సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో ఉద్యమం కారణంగా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఈకార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిధి ఏఐటియుసీ రాష్ట్రప్రధానకార్యదర్శి జి.ఓబులేషు నేటి ధీక్షా శిభిరాన్నిముగించిన సందర్బంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు న్యాయమైన సమస్యలు పరిష్కారీంచడంలో ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే మాత్రం జూన్ 10 తరువాత ఏఐటియుసి తరుపున ఈ ఉద్యమానికీ మద్దతుగా ప్రత్యక్ష పోరాటాని సిద్దపడతామని హెచ్చరించారు.

ఈనిరాహారదీక్షలలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు వి.వి.మురళికృష్టనాయుడు, ఏ.సాంబశివరావు,యన్.టి.ఆర్ జిల్లా జెఏసి చైర్మన్ దేవపల్లి శ్రీనివాస్,జిల్లా ప్రధానకార్యదర్శి ఏనుగు శ్రీనివాసరావు,,రెవిన్యూఅసోషియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి బత్తినరామకృష్ట,ఏఐటియుసి నాయకులు యం.సాంశివరావు,నీలం దుర్గారావు,సిఐటియు నాయకులు శ్రీ.సుధాకర్,రిటైర్టుఎంప్లాయిస్ నాయకులు బి.లవకుమార్.ఆర్టీసీ రిటైర్టుఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి కె.ఆర్.ఆంజనేయులు.మున్సిఫల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శీ.సురేంధ్ర,ఔట్ సోర్శింగు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వి.సతీష్ ,ఎ.యన్.యం అసోషియేషన్ నాయకురాలు కె.వి.యస్ లక్షి తో పాటు అధికసంఖ్యలో ఉధ్యలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *