విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేని ఎదుగుదల కలలో కూడా సాధ్యం కాదని, ప్రత్యేక హోదా అంటే ప్రతి ఒక్కరి ప్రజల హోదా అనేది ఇంత వరకు ఏ నాయకుడు ఈ ప్రజలకి వివరించలేదని గాంధీదేశం సోషల్‌వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ అన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో మూడవ రోజు దండియాత్ర-2 రిలే నిరాహార నిరసన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ప్రజలు, ప్రజల కోసం పోరాడకుండా ఈ నాయకులు ప్రజల కోసం పోరాడే పరిస్థితి లేదన్నారు. పోరాడకుండా మనకి స్వాతంత్య్రం పొందలేదన్నారు. పోరాడకుండా ఏ పార్టీలు పరిపాలనా విధానాన్ని అలంకరించలేదన్నారు. నేను చేస్తున్న దీక్ష ఈనాడు సాధారణ దీక్షగా భావించవచ్చు. సాధించగలిగే దీక్ష అనేది చరిత్రని అందరికీ నిరూపిస్తుంది. నేను మరణం చెందవచ్చు కాని చరిత్ర మీకు ఆ సందేశాన్ని భావితరాలకు అందిస్తుంది. మహాత్మాగాంధీని అతి దారుణంగా హత్యచేసిన 30వ తేదీన కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేస్తూ వుంటానని తెలిపారు. ఢల్లీి, తమిళనాడు, తెలంగాణ వివిధ రాష్ట్రాలంతా తిరుగుతూ వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ అన్ని చోట్లా దీక్షలు చేయనున్నానన్నారు. దేశంలో అందరూ ఒక్కటే కొందరు ఎక్కువ, కొందరు తక్కువగా ఉండకూడదన్నారు. రాజకీయనాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఉద్యోగస్తుల కడుపు కొట్టి, పేద ప్రజలకు ప్రాణాలు పిండేస్తున్నారన్నారు. వీటిని అరికట్టాలంటే మరో గాంధీ, అంబేద్కర్ పుట్టి రావాలంటే అయ్యే పనికాదు. పుట్టినవారే ఎవరైనా మారాలని సందేశమిస్తూ ఎపి, జెఎసి ఉద్యోగస్తులకి వాళ్ళ కుటుంబాలకి న్యాయం చూకూర్చాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ‘బంగారు’ భారతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News