Breaking News

పాఠశాలల అభివృద్ధికి సరైన ప్రణాళిక వేయాలి

– సమగ్ర శిక్షా జాయింట్ డైరెక్టర్ (స్టేట్ ప్లానింగ్ కో ఆర్డినేటర్) సీహెచ్.వాసుదేవరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళిక వేసుకుని, నిధులు సద్వినియోగపరచుకోవాలని సమగ్రశిక్షా జాయింట్ డైరెక్టర్ (స్టేట్ ప్లానింగ్ కో ఆర్డినేటర్)  సీహెచ్.వాసుదేవరావు  అన్నారు. మంగళవారం విజయవాడలోని ఓ హోటల్లో వార్షిక పని ప్రణాళిక మరియు బడ్జెట్ (వర్క్ షాప్ ఆన్ యాన్యూల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్) అంశంపై మూడు రోజులు కార్యశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ (స్టేట్ ప్లానింగ్ కో ఆర్డినేటర్) సీహెచ్.వాసుదేవరావు మాట్లాడుతూ… పాఠశాలలైనా, విద్యార్థులైనా బాగుపడాలంటే క్షేత్రస్థాయి నుంచి చక్కని ప్రణాళిక వేసుకోవాలని, అప్పుడే విద్యావ్యవస్థ లక్ష్యాలను అందుకోగలమని అన్నారు. వార్షిక ప్రణాళిక, నిధులు సద్వినియోగం సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యశాల ద్వారా నేర్చుకున్న విషయాలను జిల్లా, మండలస్థాయిలో కూడా అవగాహన పరచాలని కోరారు. దీనికోసం అవసరమైన శిక్షణా కరదీపికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యశాలలో కైవల్య సంస్థ ప్రతినిధి రవికృష్ణ, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సిబ్బంది, డైట్ ప్రిన్సిపాళ్లు, జిల్లా వ్రత్తి విద్యాశాఖాధికారులు, జీసీడీవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయలు, కేజీబీవీ ఎస్ఓలు, నేషనల్ ప్లానింగ్ కో ఆర్డినేటర్లు, ఏఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *