Breaking News

అంగరంగ వైభవంగా ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ బహుమతి ప్రధానోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా మే ఒకటో తేదీ నుంచి 30వ తారీకు వరకు ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం నందు సమర్ కోచింగ్ క్యాంప్ 2023 ను ఎంతో ఘనంగా నిర్వహించినట్టుగా గుంటూరు నగర మేయర్ కావటి శివనాగు మనోహర్ నాయుడు తెలిపారు. ఈ సమర్ కోచింగ్ క్యాంపు నందు 1188 మంది అప్లికేషన్ తీసుకొని 851 మంది ఈ క్యాంపు నందు వివిధ క్రీడాంశాలలో శిక్షణ పొందేందుకు గాను చేరినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి క్రీడాంసము నందు క్రీడాకారులకు పోటీలు నిర్వహించి వారిలో గెలుపొందిన మొదటి రెండవ మరియు మూడవ స్థానాలకు ఈరోజు బహుమతి ప్రధానోత్సవం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం నందు ఒక నూతన జిమ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా దాంతోపాటు వాకింగ్ ట్రాక్ మరియు స్టేడియం నందు అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు అన్నిటిని కూడా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్ గోపి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం కోచ్లు మరియు ఇతర సిబ్బంది క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *