కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విధి నిర్వహణలో నిబద్దత, సేవా తత్వం తో ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కొత్తగా సి ఐ గా విధుల్లో జాయిన్ అయిన వైభోగుల జగదీష్ రావు హోం మంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత సీ ఐ జగదీష్ ను అభినందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాకినాడ లో ఇంటిల్జెన్సీ విభాగంలో సి ఐ గాపని చేస్తున్న జగదీష్ బదిలీపై కొవ్వూరు డివిజనల్ ఎస్పీ కార్యాలయంకు బదలీ పై వొచ్చి బుధవారం విధుల్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది ఆయన్ని అభినందించడం జరిగింది.
Prajavartha Online Telugu News