-ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ, హార్టికల్చర్ రంగం లోని 952 మంది రైతులకు రూ.102.20 లక్షలు నగదు బదలీ
-జూన్ ఒకటిన రైతు భరోసా నగదు విడుదల జిల్లా స్థాయి కార్యక్రమం
-జూన్ 2 న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం 2.0 మెగా గౌండ్ మేళా
– కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులందరికి సాగు ఖర్చు నిమిత్తం పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశ్యముతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున అందజేస్తూ 2023-24 సంవత్సరానికి తొలి విడతగా గురువారం రూ.7500 లను రైతుల ఖాతాకు జమ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. 2023-24 ఏడాదికి చెంది తొలి విడత గా 1,35,867 మంది రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా కింద రూ .5500 చొప్పున రూ.76.26 కోట్లు, పి ఎం కిసాన్ యోజన కింద రూ.2000 వెలు చొప్పున రూ.25.61 కోట్లు వెరసి సుమారు రూ.101.91 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల 2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, హార్టికల్చర్ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ రంగం లోని 577 మంది రైతులకు చెందిన 331.34 హెక్టర్ల పంట నష్టం కింద రూ.46.83 లక్షలు , హార్టికల్చర్ రైతాంగానికి చెందిన 475 హెక్టార్ల పంట నష్టం కింద రూ.55.37 లక్షలు నగదు బదలీ చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు జిల్లా, పత్తికొండ మండలము నుండి జమ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలోని యామర్జెన్సీ పునరవేశ కేంద్ర భవనంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సాగు నీటి విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొనడం జరిగిందన్నారు.
జూన్, 2 వ తేదిన డాక్టర్ వై. ఎస్. ఆర్ యంత్ర సేవా పథకము-2023 నకు సంబందించి మెగామేళా రెండవ దశ కార్యక్రమంను గుంటూరు జిల్లా, చుట్టుగుంట నుండి ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి లో ప్రారంభిస్తాన్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నందు శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. రెండో దశ వైయస్ఆర్ యంత్ర భరోసా కింద 166 ట్రాక్టర్లు, ఇతర అనుబంధ యూనిట్స్ రూ.595.78 లక్షల సబ్సిడీ తో కూడి అందచేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
మండలాలు వారీగా జమ చేయుచున్న రైతు భరోసా – పిఎం కిసాన్ యోజన నగదు వివరాలు:
అనపర్తి మండలం 4,318 మంది రైతుల ఖాతాలో రూ. 3.238 కోట్లు, బిక్కవోలు మండలం 7,219 మంది రైతుల ఖాతాలో రూ.5.414 కోట్లు, రంగంపేట మండలం 8,255 మంది రైతుల ఖాతాలో రూ. 6.941 కోట్లు, రాజానగరం మండలం 11103 మంది రైతుల ఖాతాలో రూ. 8.327 కోట్లు, కోరుకొండ మండలం 10,868 మంది రైతుల ఖాతాలో రూ.8.151 కోట్లు, సీతానగరం మండలం 8,499 మంది రైతుల ఖాతాలో రూ. 6.374 కోట్లు,
కడియం మండలం 5,407 మంది రైతుల ఖాతాలో రూ. 4.055 కోట్లు, రాజమహేంద్ర వరం రూరల్ మండలం 2,045 మంది రైతుల ఖాతాలో రూ. 1.534 కోట్లు, జగ్గంపేట నియోజక వర్గం గోకవరం మండలం 10,808 మంది రైతుల ఖాతాలో రూ.8 106 కోట్లు, దేవరపల్లి మండలం 8,010 మంది రైతుల ఖాతాలో రూ. 6.007 కోట్లు, గోపాలపురం మండలం 8,683 మంది రైతుల ఖాతాలో రూ. 6.512 కోట్లు, నల్లజర్ల మండలం 10,178 మంది రైతుల ఖాతాలో రూ. 7.633 కోట్లు, కొవ్వూరు మండలం మంది 6,051 రైతుల ఖాతాలో రూ. 4.538 కోట్లు, చాగల్లు మండలం 5,909 మంది రైతుల ఖాతాలో రూ. 4.432 కోట్లు, తాళ్లపూడి మండలం 5,507 మంది రైతుల ఖాతాలో రూ.4.131 కోట్లు, నిడదవోలు మండలం 8,892 మంది రైతుల ఖాతాలో రూ. 6.669 కోట్లు, ఉండ్రాజవరం మండలం 5,705 మంది రైతుల ఖాతాలో రూ. 4.279 కోట్లు, పెరవలి మండలం 7,409 మంది రైతుల ఖాతాలో రూ. 5.559 కోట్లు జమ చెయ్యనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News