-ఉదయం 9.30 నుంచి 12.30 వరకు
-జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాలు . హాజరుకానున్న 9473 మంది
-పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు
-డి ఆర్వో జి. నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నుంచి నిర్వహించనున్న 10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 6667 మంది, ప్రవేటు విద్యార్థులు 2806 మంది హాజరు కానున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తెలిపారు.
బుధవారం సాయంత్రం డి ఆర్వో ఛాంబర్ లో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం తో కలిసి సమన్వయ శాఖల అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జి నర్సింహులు మాట్లాడుతూ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందు తప్పనిసరిగా విద్యార్థులు హాజరు కావలసి ఉంటుంది అన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి వ్యవస్థ , మెడికల్ క్యాంపు లను ఏర్పాట్లను చేయడంతో పాటు, పరీక్షా కేంద్రాల వద్ద పారిశుధ్యన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహణ కోసం నాలుగు రెవిన్యూ ఆఫీసర్స్ , 4 గురు ఎస్ ఐ లు, 4 కానిస్టేబుల్స్ తో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి డివిజన్ లో 25 కేంద్రాలు, కొవ్వూరు డివిజన్ లో 19 కేంద్రాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మునిసిపల్ మరియు మండల పరిధిలోని ప్రధాన కేంద్రాలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఈవో ఎస్ అబ్రహం తెలిపారు. ఉ.9.30 నుండి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్ 2 న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు , కంపోసిట్ కోర్స్, జూన్ 3 న రెండవ లాంగ్వేజ్ హిందీ సంస్కృతం, జూన్ 5 న ఇంగ్లీష్, జూన్ 6 లెక్కలు, జూన్ 7 న సైన్స్, జూన్ 8 న సామాజిక శాస్త్రం, జూన్ 9 న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 , ఓఎస్ ఎస్ సి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ .1, జూన్ 10 న ఓఎస్ ఎస్ సి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
జిల్లా విద్యాధికారి ఎస్. అబ్రహం, డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్ డి. రామ వర్మ, ఆర్ ఎం సి మెడికల్ ఆఫీసర్ డా ఎ.వినూత్న, డిటివో ఎన్. సత్యనారాయణ, ఆర్టీసి లైజాన్ అధికారి బివీఎస్ ఎన్ కుమార్, వైద్య శాఖ అధికారి పి. జాన్సన్, పోస్టల్ అధికారి ఎల్. శ్రీనివాస్, పంచాయతీ రాజ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News