Breaking News

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తి స్థాయిలో అంది పుచ్చుకోవాలి

-అమృత్ సరోవర్ పథకం పనులు ఇంకనూ పూర్తి కాని వాటిని వేగవంతం చేయాలి
-అమృత్ సరోవర్ పథకం పనుల వివరాలు ఖచ్చితత్వంతో ఆన్లైన్లో చెక్లిస్ట్ మేరకు అప్లోడ్ చేయాలి
-జగనన్న స్వచ్చ సంకల్పం కింద మంజూరై ప్రారంభం కాని సంపద కేంద్రాలను సత్వరమే ప్రారంభించి పురోగతి చూయించాలి
-ఉద్యాన పంటలు లక్ష్యాల మేరకు సాధించేలా చర్యలు ఉండాలి:కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఎంపిడిఓ లు, సహాయ పథక సంచాలకులు, సహాయ ప్రాజెక్టు అధికారుల తో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్ తో కలిసి వర్చువల్ విధానంలో సమీక్షిస్తూ అమృత్ సరోవర్ పథకం కింద ఇంకనూ పూర్తి కాని పనులను వేగవంతం చేయాలని, కూలీల హాజరు శాతం పెరగాలని, హార్టికల్చర్ అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని వర్షాకాలం లోపు ఉపాధి హామీ పనులు లక్ష్యం మేరకు జరిగేలా వేగవంతం చేయాలని, సరాసరి కూలీ రూ.272 కు తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.

బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్లో వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులలో కూలీల హాజరు శాతం పెంచాలని, పని దినాలు పెరగాలని అన్నారు. ఈ వారంలో ఉపాధి హామీ కూలీల హాజరు 1,25,000 దాటేలా ఎంపిడిఓ లు పురోగతి సాధించేలా, గ్రామ పంచాయతీ వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత ఏపీఓ తదితర అధికారులతో సమీక్షించుకుని ప్రణాళికా బద్ధంగా పనిచేసి పురోగతి సాధించాలని అన్నారు. హార్టికల్చర్ పనులపై దృష్టి పెట్టి ప్రతి మండలంలోని అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఈ సెప్టెంబర్ వరకు మనకు ప్రతి మండలం వారికి కేటాయించిన లక్ష్యాలు తప్పకుండా సాధించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కూడా నిబంధనల మేరకు కవర్ అయ్యేలా గ్రామ పంచాయతీ వారీగా గుర్తించి వారికి పనులు కల్పించి పని దినాలు మెరుగ్గా ఉండేలా చేయాలనీ అన్నారు. 50% కన్నా పురోగతి తక్కువ ఉన్న మండలాల పనితీరు మెరుగుపడాలని తెలిపారు.

జిల్లా యంత్రాంగం ఉద్యాన పంటలు వేసుకునే వారికి త్వరిత గతిన ఏపీఎంఐపి ద్వారా డ్రిప్ మంజూరు చేయడం జరుగుతుందని రైతులను ఇందుకు ప్రోత్సహించాలని, ఆగస్ట్ లోపు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం జరగాలని అన్నారు. రైతుల పొలంలో పూల మొక్కల పంట, ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా లో ప్రస్తుతం సరాసరి కూలీ రూ.260 ఉందని, కానీ ఉండాల్సిన సరాసరి కూలీ రూ.272 అనీ, దీనిని అందిపుచ్చుకుని సరాసరి కూలీ పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత మండలం ఏపిఓ బాధ్యులుగా దీనిని గ్రామ పంచాయతీ వారీగా సమీక్షించి సమయానుసారంగా ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో ఉపాధి హామీ కూలీ చెల్లింపులు సకాలంలో జరగాలని, నిబంధనల మేరకు సరాసరి వేతనం అందేలా చర్యలు ఉండాలని సూచించారు. 7346 జాబ్ కార్డుల ఆధార్ అనుసంధానం ఇంకా పూర్తికాని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించబడిన ట్రాన్సాక్షన్ల రీకన్సిలేషన్ పెండింగ్ ఉండరాదని అన్నారు.

అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన 105 పనులలో ఇంకా పూర్తికాని 21 పనులను సత్వరమే పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అమృత్ సరోవర్ పథకం పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన నాలుగు టీములు వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చెక్ లిస్ట్ ప్రకారం 26 అంశాలు సక్రమంగా అమలవుతున్నాయా అని పరిశీలిస్తున్నారని, ఆ వివరాలను సక్రమంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఈ పథకం అమలు తీరును ప్రధానమంత్రి కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నారని పనితీరు లక్ష్యాలను అందిపుచ్చుకునేలా ఉండాలని ఆదేశించారు.

జగనన్న స్వఛ్చ సంకల్పం కింద మంజూరై ఇంకనూ ప్రారంభం కాని చెత్త నుండి సంపద కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా పంచాయితీ అధికారి రాజ శేఖర్ రెడ్డి, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవో, ఏపీడి లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *