-మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎజిఎం మహమ్మద్ అంజాద్ అలీ పదవీ విరమణ కార్యక్రమంలో
-మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో అల్ప సంఖ్యాక వర్గాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు వివిధ హోదాల్లో సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి కృషిచేసి నేడు పదవీ విరమణ చేస్తున్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహమ్మద్ అంజాద్ అలీ వంటి ఉద్యోగులు అందించిన సేవలు భవిష్యత్ తరం ఉద్యోగులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ అన్నారు. అంజాద్ అలీ రిటైర్మెంట్ కార్యక్రమం లబ్బీపేట లోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆసిఫ్ మాట్లాడుతూ ఎంతోమంది పేద వర్గానికి చెందిన ముస్లింలకు కార్పొరేషన్ ద్వారా రుణ సహాయం అందించేందుకు అంజాద్ కృషి చేశారన్నారు. ఇటువంటి ఉద్యోగుల సేవలు ముస్లిం సామాజిక వర్గం, కార్పొరేషన్ అభివృద్ధికి ఎంతో దోహదం చేసాయని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి షిరీన్ బేగం మాట్లాడుతూ 37 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో పనిచేసి ఒక ఉన్నత స్థాయికి రావడం ఆయనలోని అంకితభావానికి నిదర్శనం అన్నారు. అతిధులతో కలిసి అంజాద్ శాలువా, పూలమాల, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. మైనారిటీస్ కమీషనరేట్ డిప్యూటీ డైరెక్టర్ మస్తాన్ వలి, మైనారిటీస్ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరి శ్రీ శ్రీనివాస్, ఎ.పి. రాష్ట్ర దూదేకుల (మైనారిటీ) కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ మస్తాన్ పాల్గొని పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం వివిధ జిల్లాల కార్పోరేషన్ అధికారులు, రాష్ట్ర కార్పోరేషన్ అధికారులు పదవీ విరమణ చేస్తున్న శ్రీ మహ్మద్ అంజద్ అలీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ అసోషియేషన్ ప్రతినిధులు సబియా పర్వీస్, అక్రమ్ అలి రీజినల్ ఆఫీసర్, సుబ్బారావు, సుబ్రమణ్య శాస్త్రి, ఎకౌంట్ ఆఫీసర్, శ్రీనివాస్, ఓ. హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News