Breaking News

GROUP-1 SERVICES (MAIN) పోస్టుల భర్తీ కొరకు 02 కాలేజీలలో పరిక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నందు ది.03.06.2023 నుండి 10.06.2023 (04.06.2023 ఆదివారం మినహాయించి) వరకు GROUP-1 SERVICES (MAIN) పోస్టుల భర్తీ కొరకు 02 కాలేజీలలో పరిక్షలు నిర్వహించుచున్నారు. సదరు (Off-line) వ్రాత పరిక్ష (Descriptive Type) పరీక్షలను సజావుగా నిర్వహించే౦దుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసియున్నారు.

APPSC GROUP-1 SERVICES (MAIN) పరీక్షలు ది.03.06.2023 నుండి 10.06.2023 వరకు (04.06.2023 ఆదివారం మినహాయించి) ఉదయం 10.00 గంIIల నుంచి 01.00 గంIIల వరకు నిర్వహించబడునని మొత్తం 1307 మంది అభ్యర్దులు హాజరగుచున్నారని తెలిపారు. ప్రతి సెంటర్ లో పరీక్షలు సక్రమముగా నిర్వహించుటకు జిల్లా అధికారులను ను Liaison Officer గా నియమించబడినారని తెలిపారు.

సూచనలు:
1. చీఫ్ సూపరింటెండెంట్స్ పరీక్ష కేంద్రము యందు పరీక్ష కేంద్రం కోడ్, పరీక్ష సమయము మొదలగు వివరములతో కూడిన బోర్డు/బానర్ ఏర్పాటు చేయవలెను. పరీక్ష కేంద్రములలో అభ్యర్ధులు కేటాయించబడిన రూములు మరియు వారి హాల్ టికెట్ నెంబర్ల వివరములు కూడిన బోర్డు ఏర్పాటు చేయవలెను.
2. పరీక్షా కేంద్రములలోనికి అభ్యర్ధులును ఉదయం 09.00 గంIIల నుండి 09.30 ని.లకు వరకు మరియు గ్రేస్ పీరియడ్ 15 ని.ల వరకు అనగా 09.45 ని.ల వరకు మాత్రమే లోనికి అనుమతిస్తారు. తదుపరి పరీక్షా కేంద్రములోనికి అనుమతించబడరు.
3. అభ్యర్ధులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును (ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు)
పరీక్షా కేంద్రానికి తెచ్చుకోనవలెను.
4. అభ్యర్ధులు తమతోపాటు ఎటువంటి సెల్ ఫోన్స్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు తమవెంట తీసుకురావద్దని
తెలియజేయటమైనది. కావున, అభ్యర్ధులు పై విషయములను గమనించగలరు.
5. అభ్యర్ధులు పరీక్ష పూర్తయ్యే వరకు తప్పని సరిగా ఉండవలెను. పరీక్ష సమయము మధ్యలో బయటకు వెళ్ళుటకు అనుమతించబడరు.
6. APPSC వారు మొదటి సారిగా బయో మెట్రిక్ హాజరును ప్రవేశ పెట్టినారు. కావున అభ్యర్దులు గమనించగలరు.
7. చీఫ్ సూపరింటెండెంట్స్ అందరు మీ పరీక్ష కేంద్రములయందు అభ్యర్ధులు కొరకు కనీస వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయవలెను.
8. అన్ని పరీక్ష కేంద్రాలలో DM&HO వారు వారు అన్ని పరీక్ష కేంద్రములలో వారి సిబ్బందిని నియమించి వారితో పాటు O.R.S. పాకెట్లు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూడవలసినదిగా ఆదేశించటమైనది.
9. పోలీసు సిబ్బంది వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి సూచనల ప్రకారము సరైన అభ్యర్దులను వారి హాల్ టికెట్ పరిశీలించిన పిమ్మట, అభ్యర్దుల వద్ద ఎటువంటి సెల్ ఫోన్స్ , కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరములు లేవని నిర్థారించుకోనినరీక్ష తరువాత మాత్రమే అభ్యర్దులను పరీక్ష కేంద్రముల లోనికి అనుమతించవలెను.
10. పరీక్ష రాసే అభ్యర్ధుల సహాయార్ధం కలెక్టర్ వారి కార్యాలయము, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నందు ది.02.06.2023 నుండి 10.06.2023 వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటము జరిగినది. సదరు కంట్రోల్ రూమ్ నెంబర్లు: 9603587170 , 7396917941

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *