Breaking News

బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. బాణా సంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారు. మరణించిన వారంతూ చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలను సమాచారం తెలుసుకున్న సీఎం… ఈ విధంగా స్పందించారు. ఆయా కుటుంబాను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *