విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సంఘసంస్కర్త, మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నుపాటి విద్య జయంతి ఉత్సవం స్థానిక వాసవ్య మహిళా మండలి నందు జరిగినాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ అద్వితీయమైన ఉన్నత భావాలతో 9 మంది మహిళలతో వాసవ్య మహిళా మండలి ని 1969 లో స్థాపించి మహిళా అభ్యుదయానికి ఎంతో తోడ్పాటు నిచ్చారని ఆమె అన్నారు. వాస్తవిక సంఘదృష్టి వ్యక్తిత్వం (వా-స-వ్య) అనే ప్రతిపాతికనతో సంస్థ పనిచేస్తూ ముందుకు వెళుతున్నామని ఆమె అన్నారు. ప్రతీ సంవత్సరం విద్యగారి పుట్టిన రోజును ( 5 జూన్) వాసవ్య ఫ్యామిలీ డే గా నిర్వహిస్తామని ఆమె అన్నారు, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఆమె జీవన ప్రయాణం జరిగిందని ఆమె అన్నారు. అనంతరం ప్రముఖ వైధ్యులు జి. సమరం మాట్లాడుతూ విద్య రొండు సార్లు పార్లమెంటు సభ్యులుగా సమాజానికి ఎనలేని సేవలు చేసి అనేక మంది జీవితాలలో మార్పును తెచ్చారని ఆయన అన్నారు. ఎదుటి వారి సమస్యలను వారి సమస్యగా తలచి వారికి వెన్నుదట్టి సహాయకారిగా ఉండేవారన్నారు. వీధిబాలల సంరక్షణ కొరకు ఎంతగానో పాటు పడ్డారని వారు ఆప్యాయత గా అమ్మ పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి జి.రశ్మి మాట్లాడుతూ మహిళలు అక్షరాస్యత కలిగిఉండాలన్న ఉద్దేశంతో వయోజన విధ్య తరగతులను 1970 దశకంలోనే ప్రారంభించి వారి జీవితాలలో పెనుమార్పు తెచ్చారని, ఆమె వేసిన బాటలోనే ప్రస్తుతం కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి మెడికల్ డైరెక్టర్ పి.దీక్ష, డాక్టర్ మెహర్ ప్రసాద్, చెన్నుపాటి వజీర్, విజయ, వినయ్, వాసవ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News