Breaking News

విద్యార్థి దశలో సమయమే కీలకం…

-పదవ తరగతి టాపర్లకు జ్ఞాపికలు అందజేత
-ఎన్‌ టి ఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీ రావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశలో బాల బాలికలు తమకు ఉన్న సమయాన్ని చాకచక్యంగా వినియోగించుకోవడంలోనే విజయం దాగి ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
నగరం లోని ఎస్‌ కె పి వి హిందూ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ క్రీడా ప్రాంగణంలో బాక్సింగ్‌, రెజ్లింగ్‌ వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమానికి ఆయన సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలైతే జీవితం దుర్భరమయం అవుతుందని, సైంటిస్టులు ఎక్కడి నుంచో పుట్టుకురారని, విద్యార్థుల నుంచే ఉద్భవిస్తారన్నారు. కొత్త ఆలోచనలతో ప్రయోగాల వైపు దృష్టి సారించాలన్నారు. జీవితంలో ఎంతో కఠినమైన సవాళ్లు ఉంటాయని, పట్టు సడలకుండా రెజ్లింగ్‌ లో ఎలాగైతే కుస్తీ పట్టు పట్టి ప్రత్యర్థిపై గెలుస్తారో అలాగే జీవితంలో గెలవాలని అన్నారు. హిందూ హైస్కూల్‌ యాజమాన్యం చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు, ఎన్‌ సి సి, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు,తల్లిదండ్రులను దుశ్శాలువాలతో ఆయన సత్కరించారు. రెజ్లింగ్‌ విజేతలకు పతకాలను అందజేశారు. విద్యార్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఉపాధ్యాయులు ఎస్‌ వెంకటేశ్వరరావు, ఎం సువర్ణ కుమార్‌ లను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌ సి సి కవాతు ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్‌ కమిటీ అధ్యక్షులు చిట్టూరి ఆనంద రామ సుధాకర్‌, బి ఎన్‌ కళాశాల కరస్పాండెంట్‌ తూనికుంట్ల శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్లు మండే పూడి చటర్జీ, మహాదేవపు అప్పాజీరావు, ఉపాధ్యాయ కార్యదర్శి సి హెచ్‌ రాజశేఖర్‌, ఎన్‌ సి సి అధికారి బి బ్రహ్మేశ్వర రావు, ఉపాధ్యాయులు కె శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వరరావు, జె.ఆనంద్‌ కుమార్‌, జి.పురుషోత్తం పాల్గొనగా వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్‌.లక్ష్మీ, ఎం.వి సత్యప్రసాద్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *