విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు తీసుకొంటునట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 10వ డివిజన్ 47వ సచివాలయం పరిధిలోని గురుణనాక్ కాలనీ, వాసవీ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటివద్దకే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అని కొనియాడారు. ఒకవైపు ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రజలలో ప్రభుత్వం కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవలని చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టించుకోకుండా నేడు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడం దారుణమని, మీ షో రాజకీయాలు, డ్రామాలతో ఇంకా ప్రజలను మభ్య పెట్టడం జరగని పని అని, ప్రజలకు మీ వాస్తవ రూపం అర్థమైంది అని రాబోయే ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారని గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,శాప్ డైరక్టర్ కావటి దామోదర్, కాలనీ వాసులు కొమ్మినేని హరిప్రసాద్,కతిక నాగేశ్వర రావు,గిరిజ శంకర్ ప్రసాద్,మాధవ అచ్చుత రావు,నల్లూరు సూర్యనారాయణ,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు
దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా పెన్షన్ అందజేత
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ వాసవీ నగర్ నందు సోమవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు సాంకేతిక కారణాల వల్ల తన పెన్షన్ నిలిపివేశారని చలమలశెట్టి శ్రీరంగనాయకమ్మ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే సచివాలయ సిబ్బంది తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు మే నెల పెన్షన్ నగదు ను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అందజేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది ఆమె వద్ద నుండి తగు పత్రాలు తీసుకుని సమస్య ను పరిష్కారించి జులై నెల నుండి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని అవినాష్ భరోసా ఇవ్వడం జరిగింది.
Prajavartha Online Telugu News