Breaking News

తెలుగుదేశం ప్రభుత్వ హాయం మొత్తం అవినీతి మయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 10వ డివిజన్ 43వ సచివాలయం పరిధిలోని విద్యుత్ కాలనీ,షిరిడి నగర్,న్యూ పీ&టి కాలనీ ప్రాంతాలలో నాయకులు,సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్  ముఖ్యమంత్రి అయ్యాక కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ,వలంటీర్ వ్యవస్థ లు ప్రవేశపెట్టి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది నేరుగా గడప వద్దకే అందిస్తున్నారని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. ఈ 10వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్, ఎంపీ, ఎమ్మెల్యే టీడీపీ వారే నని కానీ వారు గెలిచిన తర్వాత ఇంతవరకు ప్రజలకు మొహం చూపించలేదని ఎద్దేవా చేశారు. కానీ వైసీపీ నాయకులు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు.ప్రజల కి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి జగన్ తన నిజాయితీ నిలబెట్టుకున్నారు అన్నారు.. ప్రజలంతా జగన్ తోనే ఉన్నారని రానున్న ఎన్నికల్లో బాబు బుద్ధి చెప్పి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇంచార్జ్ హరీష్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,మైనార్టీ కమిషన్ మెంబెర్ జె.జె.సింగ్,శాప్ మెంబెర్ కావటి దామోదర్,మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు,స్థానిక నాయకులు మాధవ అచ్చుత రావు, నిడదవోలు ఉదయ్,హరిప్రసాద్ రెడ్డి,చిమటా బుజ్జి,రామాయణపు శ్రీనివాస్, పర్వత నేని పవన్, చందు, కిరణ్ మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *