Breaking News

యోగ శక్తితో సమగ్ర ఆరోగ్యం: మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ యోగ శక్తితో సమగ్ర ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఇది భారతీయులు వేలాది సంవత్సరాల నుండి వాడుతున్న అతి పురాతన ఆరోగ్య విధానం. దీనిని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదనను అంగీకరించి ప్రపంచమంతా దీనిని గుర్తించేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. యోగాలో 5 కోశాలు ఉంటాయని అందులో 1) అన్నమయ కోశ,2) ప్రాణమయ కోశ,3) జ్ఞానమయ కోశ,4) మనోమయ కోశ,5) ఆనందమయ కోశ అని 5 కోశాలు ఉంటాయని తెలిపారు. అందులో రెండవది ప్రాణమయ కోశ అతి ముఖ్యమైనది. అంతర శక్తి,, బాహ్య శక్తి, మరియు చక్రాలను నిర్వహణ ద్వారా బాడీ మైండ్ సోల్ మీద ఆరోగ్యం ఆధారపడుతుందన్నారు. దీనిని చైనాలో ‘ఛీ’ అని పేరు పెట్టి స్కూల్స్ మరియు కాలేజీలు ఏర్పాటు చేసి బాగా అభివృద్ధి పరిచిందని తెలిపారు. భారతదేశంలో ప్రజలు దీనిని సంప్రదాయం, ఆచారం, పేరు మీద ఆచరిస్తూ ఉత్తమ ఫలితాలు పొందుతున్నారని తెలిపారు. కానీ భారత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో యోగ ప్రాణ శక్తి విధానాలను ప్రపంచానికి అందించడం వెనకబాటుతనం కనపడుతుందని తెలిపారు. యోగ సాధనలో ప్రాణమయ కోశను ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని తెలిపారు. తమ యోగ సాధన సమితి ప్రజలలో యోగ సాధనలో ప్రాణమయ కోశకు ప్రాధాన్యత పెంచేందుకు కృషి చేస్తుందని తెలిపారు. యోగా డే జూన్ 21 వరకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాలలో యోగాశక్తి చికిత్స అవగాహన మరియు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ యోగ డే రోజున ఉత్తమ యోగారత్న మరియు సేవారత్న అవార్డులతో యోగ సాధనకు, మరియు ప్రోత్సహించిన వారికి సత్కరించాలని, నిర్ణయించినట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు .ఈ కార్యక్రమంలో భూతపాటి ఉదయ్ కుమార్, యోగా గురువు కృష్ణ, నారగాని ప్రసాద్, మాచూరి శ్రీరామమూర్తి, షేక్ అ(షఫున్నిస, తలపాటి చెన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *