Breaking News

బ్రెయిన్ ట్యూమర్‌కు అత్యాధునిక వైద్య ప్రక్రియ

-అందుబాటులోకి సురక్షితమైన విధానాలు
-డాక్టర్ సాలుమూరి ప్రేమ్‌చంద్, సీనియర్ న్యూరోసర్జన్, కామినేని ఆస్పత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెదడు పనిచేయడం లేదు.. బుర్ర హీటెక్కింది.. అనే మాటలు వింటుంటాం. మానవ శరీరం మొత్తంలో మెదడుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. చూసే కళ్లు.. నడిచే కాళ్లు అన్నీ మెదడు ఆధీనంలో ఉంటాయి. రుచి, వాసన, స్పర్శ, వినడం లాంటి అన్ని పనులు మెదడు కణాలు చేసేవే. ఆకలి, దాహం లాంటివి కూడా మెదడు కణాల ద్వారానే తెలుసుకుంటాం. చేతులు, కాళ్లు, కళ్లు, చెవులు, నాలుక.. ఇలా శరీరం అవయవాల్లోని ఏ అవయవం పనిచేయాలన్నా దానికి మూలాధారం మెదడు. శరీరంలోని అణువణువునూ నియంత్రిస్తూ, శాసిస్తూ అన్నీ తానై నడిపిస్తుంది మన మెదడు. మన శరీరమంతా మెదడు ఆధీనంలో ఉంటుంది. మెదడు ఎంత కీలకమో, అంతే సున్నితం. అలాంటి మెదడులో గడ్డ (ట్యూమర్) ఏర్పడితే అది ఎంతో ప్రమాదకరమ‌ని విజ‌య‌వాడ కామినేని ఆస్ప‌త్రి సీనియ‌ర్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ సాలుమూరి ప్రేమ్‌చంద్ తెలిపారు. మెదడులోని ఒక అవయవాన్ని నియంత్రించే భాగంలో గడ్డ ఏర్పడితే అది ఆ నియంత్రణ కేంద్రంపై ప్రభావం చూపుతుంది. ఫ‌లితంగా ఆ అవయవం చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. మెదడులోని గడ్డలు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, మురుకుదనం, జ్ఞాపకశక్తి వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం చూపుతుంది. మెదడులో అసాధారణంగా పెరిగే కణజాలాన్ని గడ్డ(ట్యూమర్) అని అంటారు. మెదడులో ఏ ప్రాంతంలో కణితి ఏర్పడినా అది మెదడు సాధారణ పనితీరును దెబ్బతీస్తుంటుంది. మెదడులో ఏర్పడిన కణతుల వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి, ఆరోగ్యవంతమైన మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో ఎక్కడ గడ్డలు ఏర్పడితే వెంటనే తెలుసుకోగలం. అదే మెదడులో గడ్డలు ఏర్పడితే మాత్రం అంత సులువుగా తెలుసుకోలేం. కొన్ని లక్షణాలను, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను బట్టి బ్రెయిన్ ట్యూమర్‌గా అనుమానించాలి. జన్యుపరమైన కారణాలతో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలోగానీ, వంశంలోగానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన దాఖలాలు ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు ఎక్కువగా రేడియేషన్ ప్రభావానికి గురయ్యే వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడులో కణితి ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా తలనొప్పి వచ్చి, క్రమంగా పెరుగుతూ ఉండడం. ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు కావడం. వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు అనిపించడం. తలనొప్పి తగ్గగానే సాధారణంగా అనిపించడం. చూపులో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం. కొన్ని సందర్భాలలో పక్షవాతం రావడం. మెదడులో కణితి ఏర్పడిన భాగాన్ని బట్టి శరీరంలో భాగాలు బలహీనపడడం వంటివి బ్రెయిన్ ట్యూమ‌ర్ ల‌క్ష‌ణాల‌ని డాక్ట‌ర్ సాలుమూరి ప్రేమ్‌చంద్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *