Breaking News

ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 3 నుండి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ SVU కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ (ప్రకాశం భవన్) లో నేడు పరీక్షల నిర్వహణ పై పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రూప్ 1 పరీక్షలు జూన్ 3 తేదీ నుండి 10 వ తేది వరకు జరగనున్నాయని ఆదివారం మినహా ఉదయం 10.00 గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం.ల వరకు నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలకు అభ్యర్థులు మొత్తం 577 మంది హాజరు కావాల్సి వుండగా, ఈ నెల తేది 3న 439, 5 న 434, 6 న 434, నేడు అభ్యర్థులు 429 మంది హాజరయ్యారని అన్నిశాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో ఎస్.డి.సి. శ్రీనివాసులు, పరీక్షల చీఫ్ సూపరిన్ టెన్ డెంట్ సుమకిరణ్, అసిస్టెంట్ రిజిస్టార్ మణి వున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *