-నిర్లక్ష్యం వహించిన వారిపై మరో దపా షోకాజ్ నోటీసులు ఇవ్వండి.
-జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణాలలో ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, లబ్ధిదారులను చైతన్యవంతులను చేయడంతో పాటు కాంట్రాక్టర్లతో ప్రతిరోజూ పనులను పర్యవేక్షణ చేసి జూలై నెలాఖరు నాటికీ లక్ష్యాలను పూర్తీ చేయాలని యస్. ఢిల్లీరావు అన్నారు. జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, నాడు – నేడు పనుల ప్రగతి స్పందన అర్జీల పరిష్కారం పై స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలోని గృహ నిర్మాణాల పనులు పూర్తిచేయడంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం లే అవుట్ల పనులు పురోగతి అసంతృప్తిగా ఉందని వీటిపై ఎంపిడివోలు, ప్రత్యేక అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేసి నిర్లక్ష్యం వహించిన వారిపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. గుత్తేదారులు పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేసినప్పుడే పనులు వేగవంతం అవుతాయన్నారు. జిల్లాలో 15,591 గృహ నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటికే 11,924 పూర్తయ్యాయని మిగిలిన 3,667 నిర్మాణాలను జూలై నెలాఖరు నాటికీ పూర్తిచేయాలన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్ల నుండి మండలవారి పనుల ప్రగతిపై కలెక్టర్ అరా తీశారు. నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజక వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాల వివిధ దశల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ డి ఎ పిడి కె. శ్రీనివాసరావు, హౌసింగ్ పీడి రజిని కుమారి, ఇఇ రవికాంత్, ఐసీడీస్ పీడీ జి. ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ ఆఫీసర్ కొడాలి అనురాధ, జిల్లా మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడివోలు ఉన్నారు.
Prajavartha Online Telugu News