Breaking News

నగరంలోని ప్రతి కూడలిని సుందరంగా తీర్చిదిద్దండి

-తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించండి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం నగరంలోని 10, 11 వార్డుల్లో గల పటమట కూడలి, పంటకాలువ రోడ్డు, కరణం గారి బజార్, కాకతీయ రోడ్డు, ఫన్ టైం రోడ్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను అధికారులతో కలసి పరిశీలించారు. పటమట కూడలి, పంటకాలువ రోడ్డు నందు సిబ్బంది ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వీకరించాలని ఆదేశించారు. కరణం గారి బజార్, కాకతీయ రోడ్డు, ఫన్ టైం రోడ్డు ప్రాంతాల్లో ఇంటి వద్దకు వెళ్ళి చెత్త వాహనాలు ఎన్ని గంటలకు వస్తున్నాయి, వీధులు తరచూ శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పట్టాణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో ప్రజలు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఎప్పటికప్పుడు డ్రెయిన్లు పూడిక తితలు,పిచ్చి మొక్కల తొలగింపు,బ్లీచింగ్ చల్లించటం, ఫాగింగ్ తదితర పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అలాగే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న, పెద్ద డ్రెయిన్ల కాలువల్లో పుడికను తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *