అందరికీ వైద్యం అందుబాటులో ఉంచడమే లక్ష్యం.. మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన పట్టణంలోని ఒకటవ వార్డులో రూ.95 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న డాక్టర్ వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు వైద్యం నిత్యం అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారన్నారు. ఈ క్రమంలో పెడన పట్టణ ప్రాంత ప్రజలకు రూ.95 లక్షల వ్యయంతో నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేసి 67 రకాల వైద్య పరీక్షలతో పాటు అత్యవసర మందులను అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. నిత్యం డాక్టర్లు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.

నూతన విద్యుత్ లైన్లను ప్రారంభించిన మంత్రి:
పాత పైడమ్మ, కొత్త పైడమ్మ కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. బుధవారం ఆయన పెడన పట్టణం ఒకటో వార్డు పరిధిలోని పాత పైడమ్మ, కొత్త పైడమ్మ (వైఎస్సార్ జగనన్న కాలనీ) కాలనీల్లో రూ.1.10 కోట్ల వ్యయంతో నూతనంగా విద్యుత్ సదుపాయం కల్పించిన కాలనీలకు ప్రారంభోత్సవం చేశారు. పాత పైడమ్మ కాలనీకి విద్యుత్ వెలుగులు నింపడంతో పాటు కొత్త పైడమ్మ కాలనీ అయిన 17 ఎకరాలలో ఏర్పాటైన జగనన్న లేఅవుట్ లోని 717 గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లైందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నీటి సదుపాయంతో పాటు ఇతర మౌలిక వసతులు త్వరలో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జీ.గీతాబాయి, పెడన మున్సిపల్ చైర్ పర్సన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ ఛైర్మెన్లు ఎం.డి. ఖాజా, బైలపాటి జ్యోతి, పెడన మున్సిపల్ కమిషనర్ బి.మహేంద్ర, ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సి.సుదర్శన బాబు, హౌసింగ్ డిఈ ఏ.శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఎం.రాజబాబు, కటకం ప్రసాద్, తలుపుల వెంకట కృష్ణారావు, బండారు మల్లిఖార్జునరావు, నాగబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *