విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లలితా జ్యూవెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్వర్ణ చరిత్రను లిఖించిందని ఆ సంస్థ అధినేత డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నెల్లూర్ లో 50వ షోరూం మైలు రాయికి చేరుకోనుందని….. 24వ తేదిన నెల్లూరు జిల్లాలో ఒకే రోజు మూడు షోరూమ్ లను లాంఛనంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు.నగరంలోనీ గురువారం ఒక ప్రముఖ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లలిత జ్యూవెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ మాట్లాడుతూ . ఈ నెల 24వ తేదీన మూడు షో రూమ్ లు సూళ్లూరుపేట లో48 గూడూరులో 49, నెల్లూరులో 50 వ బ్రాంచిలను ఒకే రోజు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ షోరూమ్ లు తన కుమార్తెలు భక్తి కిరణ్, భవ్య కిరణ్ లు ప్రారంభిస్తారని వెల్లడించారు. సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరులో వైభవోపేతంగా ప్రారంభించ నున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వందో షోరూం ప్రారంభించే విధంగా ముందుకు సాగుతమన్నారు. 150 షో రూమ్లు వరకు సౌత్ ఇండియాలోనే ప్రారంభిస్తామన్నారు. తను పుట్టిన గడ్డ మీద నెల్లూర్ లో 50 వ షో రూం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాలిటిక్స్ కి సినిమాలకు తాను దూరంగా ఉంటానన్నారు. తనకు లాభంపై ఆశ లేదని సామాన్యుల బంగారు ఆభరణాల కలను తీర్చే విధంగా హోల్ సేల్ రిటైల్ అమ్మకాలు జరుపుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News