ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా సమన్వయంతో పనిచేయాలి

-జగనన్న సురక్ష అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ సత్వర న్యాయం చేయటం కోసం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేసి.. ప్రజలకు గరిష్టంగా ప్రయోజనం చేకూరేలా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ప్లానింగ్ ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. అజిత్ సింగ్ నగర్లోని గుజ్జల సరళా దేవీ కళ్యాణ మండపం నందు జగనన్న సురక్షపై 59వ డివిజన్ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారథులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజల వద్దకు పాలన చేరువ చేసి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. నగరాలు, పట్టణాలలో ఇప్పటికే 84 శాతం మంది ప్రజలకు ఏదో పథకం రూపంలో ఈ ప్రభుత్వం మేలు చేకూర్చడం జరిగిందన్నారు. అర్హత కలిగి మిగిలిపోయిన వారికి సైతం లబ్ధి చేకూర్చి ప్రజల సంతృప్తి స్థాయిని నూటికి నూరు శాతం తీసుకెళ్లవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని సూచించారు. కనుక యంత్రాంగం తమ పరిధిలోని ప్రతి గృహాన్ని సందర్శించి ప్రభుత్వ పరంగా ఇంకా అందాల్సిన పథకాల వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలన్నారు. క్యాంపులను నిర్వహించే తేదీలను ముందుగా లబ్ధిదారులకు తెలియపరచాలన్నారు. డివిజన్లోని 5 సచివాలయాల పరిధిలో ఉన్న 92 క్లస్టర్లలో 6,623 గృహాలు ఉన్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. నెలాఖరు వరకు సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు నమోదు చేయడంతో పాటు అందని పథకాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయ్యాక జూలై ఒకటో తేదీ నుంచి సచివాలయాలవారీగా జరిగే క్యాంపులలో ప్రజలకు అవసరమైన 11 రకాల సేవలను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమాభివృద్ధిలో ముందంజలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గాన్ని.. జగనన్న సురక్షలోనూ అగ్రగామిగా నిలిపే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎండి హఫీజుల్లా, నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, పిల్లి లక్ష్మి, కొండా జయలక్ష్మి, చింతా శ్రీను, అమిత్, కంభగళ్ల రాజు, షఫీ, షేక్ వెంకట్, గళ్లెపోగు రాజు, కృష్ణ, శాంతకుమారి, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *