-పాఠశాల స్థాయి నుండే ఆర్ధిక అక్షరాస్యత ఉండాలి
-విద్యార్థులకు ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయుక్తం.
– జిల్లా ఎల్ డి ఎం .. డి.వి.ప్రసాద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక సమీకృత అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న క్విజ్ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని జిల్లా లీడ్ బాంక్ మేనేజర్ డి వి ప్రసాద్ అన్నారు.బుధవారం స్థానిక ఎస్ కె వి టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.ఈ సందర్భంగా ఎల్ డి ఎం ప్రసాద్ మాట్లాడుతూ , పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు ఆర్థిక వనరులు, అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ ఉద్దేశ్యంతో ఆల్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సూచనలను అనుసరించి విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగు తోందన్నారు. విద్యార్థులు అందరికీ సాధారణ పొదుపు వివరాలు, ఆదాయ ,వ్యయాలు, బేసిక్ బ్యాంకింగ్ , డిపాజిట్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ,చెక్ బుక్, వివిధ రకాల బ్యాంకు ఖాతాలు, బ్యాంకుకు సంబంధించిన మౌలిక భావనలపై అవగాహన అవసరం అన్నారు. ఈమధ్య విపరీతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్స్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా ఈ క్విజ్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని ప్రసాద్ తెలిపారుఈ కార్యక్రమానికి పరిశీలకులుగా అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి. దిలీప్ కుమార్వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ముదావహం అన్నారు. విద్యార్థుల లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటు వంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయుక్తం అన్నారు.మొత్తం 18 మండలాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన స్కూల్స్ తరపున ఇద్దరు విద్యార్థులు,ఒక గైడ్ టీచర్ హాజరయ్యారు.క్విజ్ పోటీలలో విజేతలు :1. ప్రథమ బహుమతి :సి హెచ్.వి డి మణికంఠ, కె.యస్వంత్ కుమార్..బిఎస్ఎన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ , దుళ్ల.. కడియం మండలం2. ద్వితీయ బహుమతి:పి సాయి చరణ్ , ఎస్ హిందూశ్రీ లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెదుళ్ళపల్లి , సీతానగరం మండలం3. తృతీయ బహుమతి:ఎం వికాస్, సిహెచ్ అరుణ్ కుమార్ లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరేంద్రపురం రాజానగరం మండలం.ప్రధమ బహుమతిగా రూ .10 వేలు, ద్వితీయ బహుమతి రూ. 7 వేలు,తృతీయ బహుమతి గా రూ.5 వేలు నగదు ఆయా విద్యార్థుల ఖాతా లో జమ చేస్తున్నట్టు ప్రసాద్ప్రకటించారు.విజేతలకు అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందచేయడం జరిగింది.జిల్లా స్థాయి లో ప్రధమ బహుమతి పొందిన ఇద్దరూ విద్యార్థులు జులై 14 న విశాఖపట్నం లో జరిగే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీ లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ అయిన దానవాయిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ డి వి ప్రసాద్,, లీడ్ బాంక్ అసిస్టెంట్ మేనేజర్ జి.శ్రీధర్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ టి. శ్రీనివాసరావు, పలువురు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News