Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలందరికీ రక్ష అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గంలో మొగల్ రాజపురం CSI స్కూల్ గ్రౌండ్ నందు 7వ డివిజన్,37, 39, 40 సచివాలయాలు మరియు 6వ డివిజన్ 38,248 సచివాలయాలు సంబంధించిన వాలంటీర్లు చేసిన సర్వేలో దాదాపు 930 మందికి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేదు అని వారి దృష్టికి తీసుకురాగా వారందరికీ ఇన్ కం,కుల ధ్రువీకరణ,మరణ జనన ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అవినాష్ అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపామని, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ‘జగనన్న సురక్ష’ చేపడుతున్నామనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. నెల రోజల పాటు చేపట్టనున్న ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా జనన, మరణ, వివాహ, కుల, ఆదాయం వంటి వివిధ రకాలైన 11 సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవలు ఎక్కడా అందించలేదని, ఒక్క ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మినీ మ్యానిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, టీడీపీ మోసపూరిత హామీలను ఎవ్వరు నమ్మేపరిస్థితిలో లేరని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరంలో ఏం అభివృద్ధి చేసింది లేదని, టీడీపీ ఐదేళ్ల పాలనలో కమీషన్ల కోసం ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ ‘జగనన్న సురక్ష’ ను సద్వినియోగం చేసుకుని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు మాధురి,అమర్నాధ్,తూర్పు కాపు డైరక్టర్ ఇజ్జాడ తేజ,డివిజన్ ప్రెసిడెంట్లు సంపత్,అబ్బినాయడు మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *