Breaking News

ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 12వ డివిజన్,51వ సచివాలయం శివాజీ రోడ్, అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ ప్రాంతాలలో సంక్షేమ లబ్ది అందుకొన్న ప్రతి కుటుంబాన్ని అవినాష్ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 12వ డివిజన్లో ఉన్నమెయిన్ రోడ్లు, సీసీ రోడ్లు,వాటర్ లైన్స్ శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చొరవతో ఈ డివిజన్ లో దాదాపు 6కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ 60 లక్షల రూపాయల తో డ్రైన్ టు డ్రైన్ వేయడం జరిగింది అన్నారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు అని దుయ్యబట్టారు.చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్నికల హామీని ఎందుకు నెరవేర్చా లేకపోయవని ప్రశ్నించారు.వీటిపై టీడీపి నేతలు సమాధానం చెప్పాలని కోరారు.ప్రజల కి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి జగన్ తన నిజాయితీ నిలబెట్టుకున్నారు అన్నారు. అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజలంతా జగన్ తోనే ఉన్నారని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి బుద్ధి చెప్పి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి  నాయకత్వాన్ని నాతో పాటు, లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్ వైస్సార్సీపీ నాయకులు దనేకుల కాళీ, చిన్న, బషీర్, ఉస్మాన్, శ్రీను తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *