Breaking News

రీ సర్వే పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలి

-ప్రతి వారం ఇచ్చే లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించాలి
-జేసీ. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు సి సి ఎల్ ఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రెవెన్యూ , సర్వే అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం రీ సర్వే ప్రగతిపై జిల్లాలో నిర్దేశించుకున్న, సి సి ఎల్ ఏ నిర్దేశించిన లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ గతవారం జూలై 6 నుంచి 11 వరకు నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్ష చేస్తూ, గౌండ్ ట్రూథింగ్ సంబందించి పోచవరం, హుకుంపేట, చీపురుగూడెం లకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అధికారుల పనితీరును అభినందించారు. వి.ఎస్ లాగిన్ లో భాగంగా 10 గ్రామాలకు గాను 4 పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాలను ఈ వారంలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. 2099 ఎకరాల కు గానూ 1017 ఎక్స్టెంట్ వివరాలు నమోదు చేయగా ఇంకా 1082 ఎకరాల వివరాలు అప్లోడ్ చెయ్యాల్సి ఉందన్నారు. తహశీల్దార్ లాగిన్ కలవచేర్ల కు చెందిన ఆన్లైన్ డేటా ప్రక్రియ పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. జూలై 12 నుంచి జూలై 19 వరకు నిర్దేశించిన లక్ష్యాలను ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చెయ్యాలని జేసీ తేజ్ భరత్ ఆదేశించారు. గ్రౌండ్ ట్రూథింగ్ 54 గ్రామాల్లో పూర్తి చెయ్యగా, ఈవారం రాజానగరం మండలం కనవరం లో జి టి పనులు పూర్తి చెయ్యాలని లక్ష్యం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ సర్వేయర్ లాగిన్ కోసం ఈ వారం 9 గ్రామాలకు చెంది మండలాలు వారిగా కొవ్వూరు 3 గ్రామాలు, రంగంపేట 2, తాళ్లపూడి 2 , నల్లజర్ల , రాజమండ్రి రూరల్ ఒక గ్రామం లక్ష్యం ఇచ్చినట్లు , ఆమేరకు పని చెయ్యలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *