Breaking News

ఓటర్ల జాబితా సవరణ చేసే విధానంలో సహాయ ఓటరు నమోదు అధికారులు వ్యక్తిగత పరిశీలన చేపట్టాలి

-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణలో చేర్పులు, మార్పులకు సంబందించిన డేటా పూర్తి స్థాయిలో పక్కాగా నిర్వహించాలని, అందుకు సహాయ ఎన్నికల నమోదు అధికారులు వ్యక్తిగత పరిశీలన అవసరం అని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ఓటర్ల జాబితా సవరణ చేర్పులు, తొలగింపులు నియోజక వర్గ ఎలెక్టోరల్ నమోదు అధికారులు, సహాయ ఎలెక్టోరల్ నమోదు అధికారులు, ఎలక్షన్ సిబ్బంది తో ఓటరు నమోదు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు ఫామ్ 6 ద్వారా, 6 ఏ ద్వారా చిరునామా, నియోజక వర్గాల మార్పులు ఫార్మ్- 8ఏ, మరణించిన వారి వివరాలు ఫార్మ్ 7 ద్వారా తొలగించడం కోసం ఇంటింటి సర్వే కోసం బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ వో) క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరుగుతుందని అన్నారు. ఆ క్రమంలో సేకరించి డేటా ఎంట్రీ విషయంలో ఆయా నియోజక వర్గాలకు చెందిన ఎన్నికల నమోదు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు కోసం వస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు వాటి వివరాలు పోర్టల్ లో నవీకరించడం, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించడం చేయాలన్నారు. కొత్తగా యువ ఓటర్లు నమోదు కోసం 18-19 మధ్య వయస్సు ఉన్న వారిని, 17 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి ప్రతి మూడు నెలల కు ముందస్తుగా ఫారం 6 ను తీసుకోవడం జరగాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

ఈ సందర్బంగా జేసీ నియోజక వర్గాలవారిగా ఓటర్ల జాబితాలను సమీక్షించి తగు సూచనలు అందించారు. జిల్లాలో 2023మే చివరి నాటికి 15,47,419 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 7,58,578 మంది, మహిళలు 7,88,726 మంది ఇతరులు 115 మంది ఉన్నారని పేర్కొన్నారు. జనాభా నిష్పత్తి ఆధారంగా రేషీయో మేరకు ఓటర్ నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబ్బంది వివరాలు తెలుపుతూ జిల్లాలో ఫారం – 6 ద్వారా 23,703 దరఖాస్తులు రాగా 19,298 పరిష్కారం చేసి నమోదు చేసామన్నారు. ఫారం – 7 క్రింద 19,905 కి గాను 18,995 తొలగించడం జరిగిందన్నారు. ఫారం – క్రింద 5,726 రాగా 5,002 నమోదు చేసామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి బూత్ స్థాయి అధికారుల వరకు దశల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు,ఓటర్ల నమోదు, తొలగింపు చేపట్టాలన్నారు. ఓటరు జాబితా హేతుబద్ధీకరణ ఉండేలా డ్రాఫ్ట్ రోల్ సమగ్ర డ్రాఫ్ట్ రోల్ జాబితా ప్రకటన, పునర్వచ్చరణ, ప్రత్యేక ప్రచార ప్రక్రియ, ఇతర కార్యకలాపాల ప్రక్రియ కు సంబంధించిన టైం లైన్స్ మేరకు జాబితా ప్రచురణ చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్వో జీ. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, రాజమండ్రి రూరల్ ఏ. చైత్ర వర్షిణి, రాజానగరం స్పెషల్ కలెక్టర్ ఎస్. సరళా వందనం, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం టిఇఎం రాజు, డిప్యూటీ కలెక్టర్ ఏ. కుమార్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *