Breaking News

రైతులు, వినియోగదారులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం…

-రైతు బజార్లలో 50 రూపాయలకే సబ్బిడీపై టమాటల పంపిణీ…
-ధరలు అదుపులోకి వచ్చేవరకు సబ్బిడీపై పంపిణీ కొనసాగిస్తాం..
-రాష్ట్ర వ్యాప్తంగా 103 రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు..
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులపై బారం పడకూడదనే ఆలోచనతో రైతు బజార్లలో సబ్బిడీపై టమాటాల విక్రయాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ సహకార ఫుడ్‌ ప్రోససింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.
నగరంలోని కృష్ణలంక రైతు బజార్‌లో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆద్వర్యంలో 50 రూపాయలకే సబ్బిడీ పై టమాటాలను వినియోగదారులకు అందించే పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పరిశీలించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలు అధికంగా ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 50 రూపాలయకే సబ్బిడీ పై టమాటాలను రైతుబజార్లలో విక్రయించడం జరుగుతుందన్నారు. రైతు బజార్లలో సబ్బిడీ టమాటాలపై వినియోగదార్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా టమాటాల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా బహిరంగ మార్కెట్లలో ధరలు పెరగడం దృష్టిలో పెట్టుకుని 600 టన్నులకు పైగా టమాటాలను సేకరించి 6 కోట్ల రూపాయల విక్రయాలు జరిపామన్నారు. బహిరంగ మార్కెట్లలో టమాట ధరలు 98 నుండి 124 రూపాయల వరకు ధర పలుకుతుందని అన్నారు. మదనపల్లి, పనమనేరు, ప్రాంతాల రైతులు వ్యాపారస్తుల నుండి కొనుగోలు చేసి దాదాపు 3 కోట్ల రూపాయలు సబ్బడీ భరించి వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 రైతు బజార్లలో సబ్బిడీ పై టమాటలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎప్పుడైతే బహిరంగ మార్కెట్లలో టమాటాల ధరలు అధికమవుతాయో ఆ సమయంలో సబ్బిడీపై టమాటాలను అందిస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 2,528 టన్నులకు సంబంధించిన టమాటలను 5 కోట్ల రూపాయల సబ్బిడీ భరించి వినియోగదారులకు అందించామన్నారు. బహిరంగ మార్కెట్లలో ధరలు అదుపులోకి వచ్చేవరకు టమాటాల పంపిణీ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులపై బారం పడకూడదనే ఆలోచనతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అవకాశం ఉన్న చోట్ల టమాటాలను సమీకరించి రోజుకు సుమారుగా 65 నుంచి 70 టన్నుల టమాటాల విక్రయం జరుగుతుందన్నారు. ప్రతి రోజు 50 నుండి 60 టన్నుల టమాటాలను సరఫరా చేస్తున్నామన్నారు. టమాట ధరలు అధికంగా ఉన్నప్పుడు వినియోగ దారులు పొదుపుగా వాడుక ఉంటుందని తలంచి ఎక్కుడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపడ టమాటాలను సేకరించి రైతుబజార్లలో విక్రయాలు చేస్తున్నామన్నారు. రైతులు బాగుండాలని, వినియోగదారుల పై బారం పడకూడదనే భావంతో ముందుకు వెళుతున్నామన్నారు. ధర తగ్గిన్నప్పుడు రైతులను ఆదుకోవడం, ధర పెరిగిన్నప్పడు వినియోగదారులపై భారం పడకూడదనే సూక్ష్మమైన విషయాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నరన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా నేటి వరకు 2,528 టన్నుల టమాటాలను సేకరించి వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. భవిషత్‌లో కూడా ఎక్కడైతే వినియోగం ఉంటుందో మార్కెటింగ్‌ శాఖ సహకారంతో లాభనష్టాలపై ఆలోచించకుండా వినియోగదారులపై బారం పడకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వినియోగదారులు రైతుబజార్లలో సబ్బిడీ పై టమాటాలను కొనుగోలు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. బహీరంగ మార్కెట్లలో టమాటల ధరలు వినియోగదారులకు అందుబాటులో వచ్చే వరకు సబ్బిడీపై టమాటాల విక్రయాలు జరుగుతాయని మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి అన్నారు.
పరిశీలనలో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమీషనర్‌ రాహుల్‌ పాండే, రైతు బజార్ల సిఇవో నందకిశోర్‌, డిప్యూటి మేయర్‌ బెల్లందుర్గ, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ జాన్‌ విక్టర్‌, స్థానిక నాయుకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *