Breaking News

జగనన్న గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

-నాడు నేడు పనులలో ప్రత్యేక దృష్టి పెట్టాలి..
-జిల్లా కలెక్టర్‌ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కలెక్టర్‌రేట్‌లోని వీడియోకాన్ఫన్‌ హాల్‌ నుండి జగనన్న గృహ నిర్మాణాలు, నాడు`నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న పనుల పరోగతిపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, ఆర్‌డివోలు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు,మున్సిపల్‌ కమీషనర్లు, ఆయా శాఖల ఇంజనీర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలోని బిలో బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న గృహ నిర్మాణాలు బేస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పియంఏవై) గ్రామీణ గృహ నిర్మాణాల పై ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గృహ నిర్మాణ పనులలో ఆలసత్వం వహిస్తున్న క్షేత్ర స్థాయి ఇంజనీర్ల పనితీరు పై కలెక్టర్‌ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వారం వారం ప్రగతిలో వెనుకబడి ఉన్నవారికి నోటీసులు ఇవ్వాలని, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఎ ఒక్కరూ డ్రాప్‌ అవుటుగా నమోదు కాకుడదన్నారు. నాడు`నేడు కార్యక్రమంలో పాఠశాలలో జరుగుతున్న పనులు, జగనన్న విద్య కానుక, పాఠశాలలో విద్యార్థుల డ్రాప్‌అవుట్ల పై తగిన కారణాలను మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ డిల్లీరావు సమీక్షించారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌కుమార్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి కె.శ్రీనివాస్‌, హౌసింగ్‌ పిడి రజనీ కుమారి, జిల్లా విద్యశాఖ అధికారి సివి రేణుక, ఆర్‌డివోలు, యంపిడివోలు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *