Breaking News

స్వచ్ఛ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి … జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఎన్నికల నమోదు అధికారులను ఆదేశించారు.
మంగళవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని తన చాంబరు నుంచి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పాల్గొన్నారు.
ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024కు సంబంధించి ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపులు, 10 మందికి మించిన ఓటర్ల కుటుంబాల వివరాలు, వంద సంవత్సరాలకు పైబడిన ఓటర్లు, నిరాశ్రయుల వ్యక్తుల గుర్తింపు, యువ ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ క్రమంలో జిల్లాలోని ఓటర్ల జాబితా తయారీ పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయనకు తెలిపారు.
పెడన, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలలో ఈపీ రేషియో(జనాభా ఓటర్ల నిష్పత్తి) ఎక్కువగా నమోదయిందని, దీనిని పునపరిశీలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలు పున ప్రారంభమైన నేపథ్యంలో నూతన ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కోసం నగరంలో ఇటీవల బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల నమోదు అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపులు, నూతన ఓటర్ల నమోదుకు ఫారం 6,7,8 లను స్వీకరించి జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈ క్రమంలో తొలగించిన ఓటర్లను ఇంటింటికి తిరిగి మరో మారు పునఃపరిశీలించుకోవాలన్నారు. జనాభా, ఓటర్ల నిష్పత్తిలో తేడాలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్.వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్యామ్ నాథ్, ఎన్నికల నమోదు అధికారులు తదితరులు కలెక్టర్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *