విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ 58వ సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందితున్న సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఏదైనా డివిజన్ లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ఇక ఆ డివిజన్ గురుంచి పట్టించుకునేవారు కాదని, గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థనలను బుట్టదాఖలు చేసేవారని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం లో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ డివిజన్ లో మా పార్టీ అభ్యర్థి ఓడిన సరే కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమైన రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామని గుర్తు చేశారు. అందుకే నేడు మేము ప్రజల్లోకి దమ్ముగా ధైర్యంగా వస్తున్నామని వారు అంతే సంతోషంగా మమ్మల్ని స్వాగతిస్తున్నారని అన్నారు. నాడు నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతి పనీ వేగవంతం గా జరిగేదని కాలనీ పెద్దలు నెహ్రూ గారితో వారికున్న అనుబంధాన్ని నెమరువేసుకొన్నారు. గతంలో మాదిరి జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా పెన్షన్లు గాని, సంక్షేమ పథకాలు గాని మన ఇంటి వద్దకే వస్తున్నాయి అంటే అది జగనన్న వల్లనే సాధ్యమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో తూర్పు లో, రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గా, 9వ డివిజన్ ఇన్ ఛార్జ్ వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, అధ్యక్షులు గద్దె కళ్యాణ్ రామ్, వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బరాజు, ఫిషర్ మాన్ సొసైటీ డైరెక్టర్ కాలి, వేణు, నాగరాజు,సబ్బు,శ్రీను మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News