విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ నుండి ఈ నెల 2న “నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ 2023” అవార్డు అందుకుని సి.ఆర్. అకాడమీ చైర్మన్ విధులకు హాజరైన కొమ్మినేని శ్రీనివాస రావు ను ఆ సంస్థ సెక్రెటరీ శ్రీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ఉద్యోగులు ఎస్. శ్రీనివాస జీవన్, ఎం.ఎస్.ఎన్ .మూర్తి, కలమండ శరత్ బాబు, లోవరాజు, ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిజం లో 46 ఏళ్ళ అనుభవం కలిగి, విలువలకు దర్పణంగా నిలబడిన కొమ్మినేని శ్రీనివాస రావు కు 2023 సంవత్సరానికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని తిలక్ అన్నారు. అనంతరం సత్తెనపల్లికి చెందిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ కౌన్సిల్ మెంబర్ ఎస్.సి.ఎం. చిన సుభాని, పెద సుభానీ చైర్మన్ కలిసి “నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ 2023” పురస్కారం పొంది తిరిగి వచ్చిననందుకు కొమ్మినేని శ్రీనివాస రావును సత్కరించారు. అనంతరం పెన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బడే ప్రభాకర రావు, ట్రెజరర్ టి.వి. రంగారావు, సెక్రెటరీ సుమ ఉపేందర్ లు కొమ్మినేని శ్రీనివాస రావు ను సత్కరించారు.
Prajavartha Online Telugu News