Breaking News

బిజెపి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది… : ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

-రైతు బాగుంటేనే దేశం సుభిక్షం సుక్పాల్ సింగ్ కైరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచిందని రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు అన్నారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని జాతీయ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుక్పాల్ సింగ్ కైరా అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవనంలో పత్రిక విలేకరుల సమావేశంలో రుద్రరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సుక్పాల్ సింగ్ కైరా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల సంక్షేమాన్ని దేయంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేసింది అని, రైతు కళ్ళల్లో వెలుగులు చూసామని ఇప్పుడు ప్రస్తుతం మోడీ నాయకత్వంలో రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నామని రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలను గాలికి వదిలేసి విదేశీ ప్రధానిగా పేరు తెచ్చుకున్న మోడీకి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ అధ్యక్షులు జట్టి గురునాథం మాట్లాడుతూ రైతుల పక్షాన కాంగ్రెస్ నిలబడి ఉంటుందని, రైతులను దైర్యంగా ఉండవలసిందిగా ఆయన కోరారు. సమావేశంలో వీరితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు  మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు లాం తాంతీయకుమారి, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, వి గురునాథం, కొలనకొండ శివాజీ, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *