కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామ సర్పంచ్ కాసాని దుర్గ కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆదివారం పరామర్శించారు. సర్పంచ్ భర్త కాసాని దుర్గారావు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచినట్లు సర్పంచ్ దుర్గ హోంమంత్రికి వివరించారు. 20 రోజుల క్రితం దుర్గారావు బైక్ పై వస్తుండగా కుమారదేవం సమీపంలో ప్రమాదవశాత్తూ స్కూటీ నుంచి కింద పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఎడమ కాలుకి తీవ్ర గాయాలయ్యి, రెండు చోట్ల ఎముక విరగడంతో ఆపరేషన్ చేసినట్లు మంత్రికి వివరించారు. డాక్టర్ల సూచనల ప్రకారం రెస్ట్ తీసుకోవాలని, తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News