విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’ అజ్మల్, మాసన కీలక పాత్రధారులుగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం మధ్యాహ్నాం ప్రకాశం బ్యారేజిపై చేశారు. ఈ మేరకు అక్కడ ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. వైయస్ మరణం దగ్గర నుంచి ‘వ్యూహం’ కథ మొదలవుతుందని చెప్పారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. వైయస్ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఇందులో చెబుతాం. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంది. ఆ హత్య కేసులో నిందితులను చూపిస్తా. భారతీరెడ్డిని నేను దగ్గరి నుంచి చూశా. జగన్ తోపాటు భారతి పాత్ర కూడా ఉంటుంది. ఎవరేమి సినిమాలు తీసినా నాకు అనవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. అందులో ప్రధాన ఘట్టాలు సినిమాలో ఉన్నాయి. నేను జగన్ కు అభిమానిని. కానీ ఎవరి పైనా నాకు ద్వేషం లేదు. జగన్ పై నాకున్న అభిప్రాయాన్ని సినిమాగా చెబుతున్నా. నా సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అగిడినా దర్శకత్వం చేయను” అని అన్నారు.
Prajavartha Online Telugu News