-రాష్ట్ర అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో లో జరిగిన విలెకరుల సమావేశంలో రాష్ట్ర మాల మహానాడు రామాజీవర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్ మాట్లాడు తూ ప్రభుత్వ నిరంకుశ తత్వ ధోరణిలో నడుస్తుం దని ఇలాంటి పరిణామం మంచిది. కాదని ప్రభుత్వా నికి ప్రభుత్వ రెవెన్యూ సబ్ రిజిస్టార్ ల కు విన్నవిస్తూ. సీఎం సొంత జిల్లాలోనే ప్రభుత్వ అసైన్ ల్యాండ్లను అక్రమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కను సైగాల్లో జరుగుతుంది. దానికి తోడు సబ్ రిజిస్టర్ లు కూడా తోడయ్యి వంక పోరంబోకులు ఆఖరికి దేవుని మాన్యాలను కూడా వదులుటలేదు. కడప శివారు ప్రాంతాల్లో పెండ్లి మర్రి మండలంలో కాజీపేట మండలంలో నాగసానిపల్లె సర్వే నెంబరు: 11 లో వేలఎకరాలు మైదుకూరు మండలంలో గల వరదాయపల్లె అసైన్డ్ భూములు, జమ్మల మడుగు నియోజక వర్గంలో, మైలవరం మండలం, ముదునూరు మండలం, గండికోట, చెన్నూరు మండలం ఇలా ప్రతి మండలంలో వేల ఎకరాల అసైన్డ్ భూములను ఎక్కడెక్కడ ఉన్నా కిందిది మీదకి మీదది కిందికి తారు మారు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు జరుగు తున్నాయి. అక్రమంగా వెంచర్లు అక్రమంగా కట్టడాలు కడుతున్న దీనివల్ల ప్రభుత్వానికి సిస్ రూపంలో కావచ్చు మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతోంది అని అన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర మాల మహానాడు నాయకులు రాష్ట్రప్రధాన కార్యదర్శి తాళ్లపాక వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి చిన్న ఓబన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గున్నంపాటి వెంకట రమణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్ మురళి ప్రసాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెరుమల్ల ప్రసాద్, రాయలసీమ మహిళా అధ్యక్షులు వేదవతి. రాయలసీమ అధ్యక్షులు పి సాగర్, రాయలసీమ సెక్రటరీ యస్ చిన్న, జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉల్లి కిరణ్ కుమార్, సికె కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News