
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతనంగా దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించబడిరది. ఆర్.ఆర్.దర్బార్ ఎదురు, మొగల్రాజపురంలో శుక్రవారం నూతనంగా ప్రారంభించిన దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ముఖ్య అతిధులుగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, విజయవాడ నగరపాలక సంస్థ స్టాండిరగ్ కమిటీ మెంబర్, డివిజన్ కార్పోరేటర్ మెరకనపల్లి మాధురిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన వెజ్, నాన్‌వెజ్ బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు ముస్తాక్ మహమ్మద్, హస్పక్ మహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ క్వాలిటీ కోసం వివిధ ప్రాంతాల నుండి దినుసులు, సరుకులు రేటుతో రాజీపడకుండా కొనుగోలు చేసి అందుబాటు ధరలతో క్వాలిటీకి, రుచి, శుచికి రాజీపడకుండా విజయవాడ మహానగరంలో ఉన్న రెస్టారెంట్లు కన్నా మంచి రుచి గల నాణ్యత గల ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందజేస్తున్నామన్నారు. నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో దమ్ బిర్యానీ, నార్త్ ఇండియన్, చైనీస్, తండూరి, గ్రిల్డ్, బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్, సలాడ్, నూడిల్స్, వివిధ రకాల కర్రీస్ తదితర వంటకాలు, ఫుడ్స్ లభిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా వివాహాధి శుభకార్యాలకు ఆర్డర్లపై అనుభవం గల చెఫ్‌లచే తయారు చేయబడిన వివిధ రకాల వంటకాలను కేటరింగ్ సదుపాయం ద్వారా అందజేస్తామన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు.
Prajavartha Online Telugu News