Breaking News

వితంతువులు, వృద్ధులు, వైకల్యం ఉన్న వ్యక్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం !!

-మంత్రి జోగి రమేష్

నిడమర్రు ( కృత్తివెన్ను ), నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేద మధ్యతరగతి బలహీన వర్గాల కష్టాలను తగ్గించడానికి సాంఘిక సంక్షేమ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ప్రకటించిందని, ముఖ్యంగా వితంతువులు, వృద్ధులు మయు వైకల్యం ఉన్న వ్యక్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.

శుక్రవారం ఉదయం మంత్రి జోగి రమేష్ కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ సచివాలయం – 2 పరిధిలో పెద గొల్లపాలెం గౌడ పాలెం తాడివెన్ను, తాడివెన్ను గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు,

బోయిన కృష్ణకుమారి, కుప్పినేని గణపతి, బట్రాజు రూపిణి, మహమ్మద్ సలీంద్ర, కుంపటి నాగలక్ష్మి, బోయిన బాలమ్మ, జెల్లా రామారావు, బసవాని సతీష్, దోనేపూడి వెంకటసుబ్బారావు, బోల్లా కనకదుర్గ, మేక పద్మ, వేపటి వరప్రసాద్, గూడవల్లి భూలక్ష్మి, వాటాల గంగాభవాని తదితరుల ఇంటికి వెళ్లి మంత్రి జోగి రమేష్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు తెలిపి ఇప్పటివరకు ఒకొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్ధిక సహాయం జరిగిందో వివరించారు.

మొదటిసారిగా వృద్ధాప్యపు పెన్షన్ అందుకుంటున్న వర్ల లక్ష్మికి మంత్రి జోగి రమేష్ ఆ మొత్తం నగదు తన స్వహస్తాలతో అందజేశారు. అలాగే ఇటీవల స్కూలుకి వెళ్లి సైకిల్ పై తిరిగి వస్తున్న ఒక బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో కాలు విరిగి వైకల్యాన్ని గురైన వేపటి రత్నకుమార్ అనే బాలునికి దివ్యాంగుల పెన్షన్ మంజూరయ్యింది ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, తన సుదీర్ఘ పాదయాత్రలో… అడుగడుగునా కనిపించిన అవ్వాతాతలతో మాట్లాడి – వారి కష్ట సుఖాలు తెలుసుకున్న మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించారని వారికి ఎంత పింఛను వస్తుంది? ఎలా ఇస్తున్నారు? తదితర విషయాలపై అవగాహన పెంచుకున్నారన్నారు. వైఎస్సార్ పింఛన్‌ కానుక పథకాన్ని సమగ్రంగా రూపొందించి.. మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు దేశంలోనే అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు . అవ్వాతాతల పింఛన్‌ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేదని.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారని.. అంతే కాకుండా రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు… ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి- అదే విధానాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పింఛన్లు పెరిగాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతు మంచానికే పరిమితమైన వారికి పదివేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నారని. కుటుంబంలో ఒకరికే కాదు…అర్హత వున్నవారందరికీ పింఛన్‌ ఇస్తున్నారని వివరించారు. ఇలా పింఛన్ల పథకంలో అనేక మార్పులు తెచ్చి సామాన్య కుటుంబాలను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు

గుడిలోకి వెళ్ళి మనమే దేవునికి కానుక సమర్పిస్తామని, కానీ భగవంతుని రూపంలో మన ముఖ్యమంత్రే స్వయంగా వివిధ వరాలను ఇస్తూ ఆడుకొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అబివృద్ది ద్యేయంగా సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెబుతూ, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, సీఎం జగన్ ను ఆశీర్వదించాలని ఆయన అన్నారు.

స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉంటే నాతో నేరుగా చెప్పండని పలువురిని మంత్రి జోగి రమేష్ అడిగారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు ఆదేశించి వాటిని అప్పటికప్పుడే పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పెద గొల్లపాలెం సర్పంచ్ బసవాని మహాలక్ష్మి , కృత్తివెన్ను మండల జెడ్పీటీసీ మైలా రత్న కుమారి,ఎంపీపీ కోనసాని గరుడ ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ వైదాని వెంకట్రావ, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పాలపర్తి జాన్ రత్నం,బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జెల్లా భూపతి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పిన్నెంటి మహేష్, ఏఎంసీ చైర్మన్ గంగాధరరావు, వర్లగానితిప్ప ఎంపీటీసీ జెల్లా సువర్ణ లక్ష్మి, పోడు ఎంపీటీసీ తమ్ము పెద్దింట్లమ్మ, చిన గొల్లపాలెం ఎంపిటిసి కొల్లాటి మహాలక్ష్మిడు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *