Breaking News

రాత్రి. 10 గం.లకే ముందే “ఈట్ స్ట్రీట్” (ఫూడ్ కోర్ట్) స్టాల్స్ పెడితే కఠిన చర్యలు

-ఎస్టేట్ అధికారికి ఆదేశాలు : కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన “ఈట్ స్ట్రీట్” (ఫూడ్ కోర్ట్) ను రాత్రి గం.10-00 నుండి అర్ధ రాత్రి 12-00 గంటల వరకు మాత్రమే అనుమతి అనుమతించడం జరిగినది అని ఎస్టేట్ అధికారి టి. శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈట్ స్ట్రీట్ నందు స్టాల్స్ కేటాయించిన వారు సాయంత్రం 6.గం.లకే స్టాల్స్ పెట్టి వ్యాపారాలు నిర్వహించడం వలన ప్రజలకు మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఫిర్యాదు రావడం జరిగినది. అందువలన ఎస్టేట్ అధికారి మరియు ఎస్టేట్ వింగ్ మొత్తం కలిసి ఈ రోజు నుంచి “ఈట్ స్ట్రీట్” (ఫూడ్ కోర్ట్) నందు 10 గంటలకే ముందే ఎవరైనా స్టాల్స్ పెట్టి వ్యాపారాలు నిర్వహిచినట్లయితే షాపు నిర్వహకునికి జరిమానా విధిస్తామని మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ తెలిపారు.“ఈట్ స్ట్రీట్” (ఫూడ్ కోర్ట్) కు వచ్చే ప్రజలంతా రాత్రి 10 గం.ల తరువాత రావాలని నగరపాలక మరియు పోలీసు సిబ్బందికి సహకరించాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ కోరారు. ఈ సందర్భంలో ప్రతి స్టాల్ వద్ద విధిగా డస్ట్ బీన్స్ ఏర్పాటు చేసుకొని పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక వ్యాపారులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *