Breaking News

అభివృద్ధి జరుగుతున్నటువంటి ఎక్సెల్ ప్లాంట్ ను పరిశీలన

-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను మంగళవారం ఉదయం నగర కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు ఆధునికీకరణ పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్న వాటర్ ఫౌంటైన్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ముందుగా ఎక్సెల్ ప్లాంట్ కు రోజుకు ఎంత చెత్త వస్తుంది అని కంప్యూటర్ రూమ్ నందు సిస్టమ్ లో తనిఖీ చేసి మరియు చెత్త వేయింగ్ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. అదేవిధంగా నూతనంగా వేసిన రోడ్డును పరిశీలించి పలు సూచనలు చేసారు.అదేవిధంగా ఎక్సెల్ ప్లాంట్ నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇన్ఫర్మేషన్ పార్కు పనులను పరిశీలించి పార్కులో జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ప్లాంట్ ఆవరణలో ఉన్న ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, ఆఫీసు బిల్డింగ్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్, వెహికల్ పార్కింగ్ వంటి ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంలో ప్లాంట్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యానవన అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *