Breaking News

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని స్వయం సహాయక సంఘాల మహిళలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగాలని డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ రూరల్‌ మండలం పాతపాడు గ్రామంలో విజయ గ్రామైఖ్య సంఘంలోని ప్రభు సేవా స్వయం సహాయక సంఘ సభ్యురాలు వెంకట సునీతకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నున్న బ్రాంచ్‌ మంజూరు చేసిన 5 లక్షల 15 వేల రూపాయల విలువైన కంప్యూటర్‌ ఎంబ్రాయడరీ మిషన్‌ను డిఆర్‌డిఏ కె. శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ దేవగిరి సుజాతలు ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైమ్‌ మినస్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ (పియంఇజిపి) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పియంఇజిపి, పియంఎస్‌యంఇ పథకాల ద్వారా 35 శాతం రాయితీతో అందిస్తున్నారన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు వైఎస్సార్‌ క్రాంతి పథకం ద్వారా బ్యాంకుల ద్వారా రాయితీతో కూడిన పలు యూనిట్లను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమములో విజయవాడ రూరల్‌ మండల ఏ.పి.యం చంద్ర శేఖర్‌, డిఆర్‌డిఏ ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *