విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో గర్భిణీలు, కౌమార దశలో ఉన్న బాలికలలో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.నగరంలోని కలెక్టరేట్ నుండి మాతాశిశు సంరక్షణ, రక్తహీనత నివారణ, తదితర అంశాలపై శుక్రవారం వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ అధికారులతో గూగుల్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన కౌమార దశలో ఉన్న బాలికలలో రక్తహీనత నివారణకు సంపూర్ణ పోషణ అందించడం ద్వారా రక్త హీనతను పూర్తిగా నివారించగలిగే అవకాశం ఉంటుందన్నారు. 15 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన గర్భిణీ స్త్రీలు, 10 నుండి 19 సంవత్సరాల యుక్త వయస్సు కలిగిన బాలికలలో రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా రక్తహీనత నివారణకు కర్యచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు చిన్నారులలో రక్తహీనతను అధిగమించి యంయంఆర్, ఐయంఆర్ మరణాలను సమర్థవంతంగా నివారించేందుకు సాధ్యపడుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆశా, ఎఎన్ఎంలు, శిశు సంక్షేమ శాఖ చెందిన అంగన్వాడీ కార్యకర్తల టీమ్ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో వైద్య సరీక్షలు, పోషకాహారం అందించడం ద్వారా రక్తహీనతను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహించడం ద్వారా గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చునని అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.కాన్ఫ్రెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. యం సుహాసిని, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, డిసిహెచ్ఎస్ డా.స్వప్న, సిడిపివోలు, సూపర్వైజర్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News