Breaking News

సెంట్రల్లో 1,458 మందికి నూతన పింఛన్లు

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అర్హతే ప్రామాణికంగా నూతన పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్ సాయిబాబా కాలనీలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి బుధవారం ఆయన కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవని.. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏటా రెండు పర్యాయాలు నూతన పింఛన్లు అందిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో కేవలం 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వంలో 26,118 మందికి పెంచడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. మొదటి విడతలో 645., రెండో విడతలో 813 కలిపి మొత్తం ఈనెలలో 1,458 మందికి కొత్త పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలో పింఛన్ల సంఖ్య 27,576 కి చేరిందన్నారు. గతంలో పోలిస్తే దాదాపు 10 వేల మందికి అధికంగా ఈ ప్రభుత్వం పింఛన్ ను అందజేస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం ద్వారా ఎన్నో లక్షల మందికి నూతన పింఛన్లు తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైఎస్ జగన్‌ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసి 65.98 లక్షల మందికి అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *