Breaking News

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు

-జగనన్న ను ఎదుర్కొనే దమ్ములేదని ఒప్పుకొన్న ప్రతిపక్షాలు:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలలో వణుకు మొదలైంది అని, అందుకే ఒంటరిగా జగనన్నను ఎదుర్కోవడం కష్టమని ప్రతిపక్షాలు పొత్తు నాటకాలకు తెర తీసాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ క్రీస్తురాజపురం నందు గల వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద అవగాహన ర్యాలీ ని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అక్టోబర్ 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది అని అన్నారు. ఈ సురక్ష క్యాంప్ లలో నిపుణులైన డాక్టర్ లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి మందులు అందజేస్తారని,కావున తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవినాష్ పిలుపునిచ్చారు. ఒక ప్రక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చెపాడుతూ ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాయని ఎద్దేవా చేశారు. నిన్న చంద్రబాబు ని జైల్లో పరామర్శించిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పడం విడ్డురంగా ఉందని, మేము ఆ విషయం గత రెండేళ్లుగా చెబుతూనే ఉన్నామని, మొత్తానికి ముసుగు తీసి జగన్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదని ఓటమిని ముందే ఒప్పుకొన్నారని చెప్పారు. 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరి వారు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించారా అని ప్రశ్నించారు. ఇంతకాలం వ్యవస్థ లను అడ్డంపెట్టుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకొన్న చంద్రబాబు నైజాం జగన్ గారి దెబ్బకి బయటపడి జైలుకు వెళ్లారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళితే పార్టీ నాయకులు, కార్యకర్తలే పట్టించుకోనే పరిస్థితి లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అవేమి పట్టనట్టు హోటల్ లో రూమ్ తీసుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసారని అది ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం అని అన్నారు. మీరు పొత్తులతో కట్టకట్టుకొని వచ్చిన ప్రజలు వారికి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,వి.ఎమ్.సి ACP సత్యవతి, CMHO రత్నావళి,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్,జోనల్ కమిషనర్ కృష్ణ,AMHO ఇక్బాల్ అమర్,మెడికల్ ఆఫీసర్ చిట్టిబాబు మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *