Breaking News

ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు ౼ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత నాలుగు ఏళ్ళుగా సచివాలయం,వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు అన్నారు. గడపగడపకు ౼ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు 16వ డివిజన్ 75వ సచివాలయ పరిధిలోని చోడిశెట్టి నరసింహ నాయుడు స్ట్రీట్ నుండి మొదలై నెలకుడితి వెంకటేశ్వర రావు స్ట్రీట్,ఉద్దగిరి గంగయ్య స్ట్రీట్ ప్రాంతాలలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ గడిచిన నాలుగు ఏళ్ళల్లో వైస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి  నెరవేర్చారని తెలిపారు.గతంలో ఐదు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉండి,ఈ డివిజన్ల ని దత్తత తీసుకుని ఒక్క అబివృద్ది పని కూడా చేయకుండా ప్రజలని మోసం చేశారు. అతి తక్కువ సమయంలో ప్రజల మన్ననలు పొందిన ఏకైక ప్రభుత్వం 1ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు వింటూ వైసీపీ పరిపాలనలో ఒక్కో ఇంటికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించారు. నవరత్నాలలో భాగంగా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని,మరో 30 – 40 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగేలా తామంతా కృషి చేస్తామన్నారు.రాష్ట్రంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు ఈశ్వర ప్రసాద్, రామకృష్ణ,వెంకటేశ్వరరావు,నానాంచేరయ్య, వేముల దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *